సోషల్ మీడియాకు అనసూయ టాటా చెప్పేసిందా..!

SMTV Desk 2018-02-07 12:49:31  anasuya, social media quit, anchor, tollywood

హైదరాబాద్‌, ఫిబ్రవరి 7: ప్రముఖ నటి, యాంకర్‌ అనసూయ అంతర్జాల౦కు టాటా చెప్పేసినట్లున్నారు. తాజాగా తనతో కలిసి ఫొటో తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ బాలుడి ఫోన్‌ను పగలగొట్టిన విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీంతో ఓ మహిళ ఆమెపై కేసు పెట్టిన ఘటన దుమారం రేపింది. తాను ఫోన్‌ పగలగొట్టలేదని, బాలుడి తల్లి అబద్ధం చెబుతోందని అనసూయ ట్విటర్‌ ద్వారా వివరణ ఇచ్చారు కూడా. అయినప్పటికీ నెటిజన్ల నుంచి విపరీతంగా కామెంట్లు వస్తుండడంతో అనసూయ సోషల్‌మీడియా నుంచి తప్పుకొన్నట్లు సమాచారం.