‘స్కై స్క్రాపర్‌’ట్రైలర్ విడుదల..

SMTV Desk 2018-02-05 13:17:17  sky scraper, trailer release, Dwayne Johnson, hollywood,

లాస్‌ఏంజెల్స్‌, ఫిబ్రవరి 5: ‘జుమాంజీ: వెల్‌కం టు ది జంగిల్‌’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన ప్రముఖ హాలీవుడ్‌ నటుడు డ్వెయిన్‌ జాన్సన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘స్కై స్క్రాపర్‌’. రాసన్‌ మార్షల్‌ థర్బర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. ట్రైలర్‌లో.. డ్వెయిన్‌ కుటుంబం 240 అంతస్తుల భవనంలో చిక్కుకుంటుంది. వారిని రక్షించడం కోసం డ్వెయిన్‌ అన్ని అంతస్తుల భవనం నుంచి దూకడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇందులో డ్వెయిన్‌ మాజీ ఎఫ్‌బీఐ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఒక కాలు లేనప్పటికీ తన కుటుంబ క్షేమం కోసం ఎంతటి సాహసానికైనా తెగించే పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంటుంది. డ్వెయిన్‌ స్వీయ నిర్మాణ సారథ్యంలో వస్తున్నా ఈ చిత్రం జులై 13న విడుదల కానుంది.