పసుపు రైతులకు రైతుబంధు పథక౦ : హరీష్ రావు

SMTV Desk 2018-02-04 12:28:47  RAITHU BANDHU, SANDAL FARMARS PROBLEMS, MINISTER HARISH RAO, MP KALVAKUNTLA KAVITHA.

హైదరాబాద్, ఫిబ్రవరి 4 : రైతుబంధు పథకాన్ని పసుపు రైతులకు విస్తరించాలని మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీష్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లాలో మార్కెటింగ్ వ్యవహారాలపై నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితతో కలిసి జలసౌధలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. పసుపు ధర తగ్గినందున రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి హరీష్ రావు.. పసుపు రైతులకు రైతుబంధు పథకాన్ని విస్తరించాలన్నారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు తక్షణ సాయంగా రూ.2 లక్షల రుణ సదుపాయం కల్పించాలని, నిజామాబాద్ రైతుల సమస్యలను అధ్యయనం చేయడానికి నిజామాబాద్ వెళ్లాలని మార్కెటింగ్‌ శాఖ జాయింట్ డైరెక్టర్ రవికుమార్‌కు సూచించారు.