డిప్యూటీ సీఎంకు ఎంపీ కవిత పరామర్శ

SMTV Desk 2018-02-03 15:29:43  DIPUTY CM, MAHAMMAD ALI, HEALTH ISSUE, MP KAVITHA,

హైదరాబాద్, ఫిబ్రవరి 3 : డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ట్రో సమస్యతో బాధపడుతున్న ఆయన రెండురోజుల క్రితం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహమూద్ అలీని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడిందని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని వైద్యులు వెల్లడించారు.