ప్రపంచకప్ విజేత పృథ్వీసేన..

SMTV Desk 2018-02-03 13:32:52  ICC UNDER-19, INDIA WON, AUSTRALIA, NEWZEALAND

మౌంట్‌ మౌంగనుయ్‌, ఫిబ్రవరి 3 : భారత్ కుర్రాళ్లు ఆసీస్ పై అన్ని రంగాల్లో అధిపత్యం చెలాయించి ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ ను కైవసం చేసుకున్నారు. దీంతో నాలుగోసారి టోర్నీ టైటిల్ ను సాధించుకున్న జట్టుగా చరిత్ర సృష్టించారు. ద్రావిడ్ సారథ్యంలో ఈ ప్రపంచకప్ లో ఆపజయం లేకుండా సాగిన టీమిండియా ఫైనల్లో అదే ఊపును కొనసాగించింది. తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 47.2 ఓవర్లో 216 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధన ఆరంభించిన భారత్ జట్టులో మనోజోత్‌ కల్రా (101, నాటౌట్) శతకంతో అలరించాడు. ముఖ్యంగా అతని చూడముచ్చటైన షాట్లకు అభిమానులు పులకరించిపోయారు. కల్రా అద్భుత ప్రదర్శనతో ‘మెన్ ఇన్ బ్లూ’ జట్టు 38.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని అలవోకగా చేధించి ప్రత్యర్థిపై ఘన విజయం సాధించింది. టీమిండియా జట్టులో కెప్టెన్ పృథ్వీ షా(29), గిల్ (31), హర్విక్ దేశాయ్(47, నాటౌట్) పరుగులు చేశారు. * మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్: మనోజోత్‌ కల్రా * ప్లేయర్‌ ఆఫ్ ద టోర్నమెంట్‌: శుభ్‌మన్‌ గిల్‌