ఫైనల్ ఫైట్ : విజయం దిశగా భారత్ జట్టు..

SMTV Desk 2018-02-03 12:28:24  icc under-19, india, australia, kalraa,

మౌంట్ మంగాని, ఫిబ్రవరి 3 : ఐసీసీ అండర్-19 ఫైనల్లో భారత్ జట్టు విజయం దిశగా దూసుకెళ్తుంది. ఆసీస్ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని ఆరంభించిన టీమిండియా జట్టులో పృథ్వి షా(29), కల్రా(52) మంచి శుభారంభాన్ని అందించారు. మధ్యలో వర్షం కొంతసేపు అంతరాయం కలిగించింది. తర్వాత మ్యాచ్ మొదలుకాగా కెప్టెన్ పృథ్వి షా బౌల్డ్ గా పెవిలియన్ కు చేరాడు. ఈ క్రమంలో కల్రా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ 21 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది. క్రీజులో శుభ్మన్ గిల్(31), కల్రా (61) ఉన్నారు.