అండర్‌-19 ఫైనల్‌ : భారత్ లక్ష్యం 217..

SMTV Desk 2018-02-03 10:08:25  icc under-19 world cup, india, australia, nagarkoti

మౌంట్‌ మంగనుయ్‌ , ఫిబ్రవరి 3 : ఐసీసీ అండర్ -19 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ జట్టు యువ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా జట్టు 47.2 ఓవర్లకు 216 పరుగులకే ఆలౌటైంది. తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టులో మెర్లో (76), ఉప్పల్ (34) రాణించారు. భారత్ బౌలర్లలో ఇషాన్ పోరెల్, శివ సింగ్, నాగర్ కోటి, అనుకుల్ రాయ్ రెండేసి వికెట్లు, శివం మావి ఒక వికెట్ దక్కించుకున్నారు.