వచ్చే నెల మల్టీ స్టారర్ సినిమా సెట్స్ పైకి..

SMTV Desk 2018-02-02 12:35:04  nagarjuna, nani, sriram adhithya, ashiwinidath

హైదరాబాద్, ఫిబ్రవరి 2: అక్కినేని నాగార్జున-నాచురల్ స్టార్ నాని కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 24వ తేదీన సెట్స్ పైకి వెళ్లనుంది. అశ్వనీదత్ నిర్మాతగా వహిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున మాఫియా డాన్ గా, నాని డాక్టర్ గా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నారు. త్వరలోనే మిగతా నటి నటుల వివరాలు అధికారికంగా ప్రకటిస్తారు.