తనిష్క గవాటే@ 1045..

SMTV Desk 2018-01-31 12:15:42  thanishka gavate, mumbai, 1045 runs, mumbai cricket association

ముంబై, జనవరి 31: ఒక మ్యాచ్ లో ఓ జట్టు 1045 పరుగులు చేయడం అంటే అసాధ్యమే.. కానీ ఒక వ్యక్తి చేస్తే.. అది వింతే.. అటువంటిది 14 ఏళ్ల కుర్రాడు సాధించాడు..వివరాల్లోకి వెళితే.. ముంబైలో జరిగిన ఓక లోకల్ మ్యాచ్ లో తనిష్క గావటే అనే కుర్రాడు 1045 పరుగులు బాది అందరిని ఆశ్చర్యపరిచాడు. 2016వ సంవత్సరంలో ప్రణవ్ ధనవాడే అనే కుర్రాడు 323 బంతుల్లో ఏకంగా 1,009 పరుగులతో నాటౌట్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఆ రికార్డును తనిష్క గావటే అనే కుర్రాడు దాటేశాడు. కాకపోతే ఈ టోర్నీకి ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ గుర్తింపు లేదని అధికారులు వెల్లడించారు. కోపర్‌ కైరానేలోని యశ్వంత్‌ రావ్‌ చవాన్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల గ్రౌండ్‌లో ముంబయి షీల్డ్‌ అండర్‌-14 ఇన్విటేషనల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో భాగంగా సోమ, మంగళవారాల్లో సెమీఫైనల్‌ మ్యాచ్‌లు నిర్వహించారు. యశ్వంత్‌ రావ్‌ చవన్‌ ఎలెవన్‌కు ప్రాతినిధ్యం వహించిన తనిష్క్‌ 1,045 పరుగులు చేసి సరికొత్త రికార్డును సృష్టించాడు. ఇందులో 149 ఫోర్లు, 67 సిక్స్‌లు ఉన్నాయి.