ఆస్ట్రేలియా వేదికగా 2020 ఐసీసీ టీ-20 టోర్నీ..

SMTV Desk 2018-01-30 13:44:00  icc- t-20, tourney, australia, mens, dubai, womens

దుబాయ్, జనవరి 30‌: 2020లో జరిగే టీ-20 ప్రపంచకప్ కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఐసీసీ నిర్వహణ వేదికలను కూడా ప్రకటించింది. మొదటిసారి ఆస్ట్రేలియా టీ-20 వరల్డ్‌కప్‌ కు ఆతిధ్యం ఇవ్వనుంది. అయితే తొలిసారి పురుషుల, మహిళల ప్రపంచక్‌ప్ లను వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. తొలుత మహిళల టీ-20 టోర్నీ ఫిబ్రవరి 21 నుండి మార్చి 8 వరకూ వెస్టిండీస్ వేదికగా జరగనుంది. తర్వాత పురుషుల టీ-20 లీగ్ కు అక్టోబర్ 18 నుండి నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియా వేదిక కానుంది.