ఎరుపు రంగులో "చంద్రుడు"..!

SMTV Desk 2018-01-30 12:35:21  super moon, blood moon, january 31, moon eclipse.

న్యూఢిల్లీ, జనవరి 30 : చంద్రుడు ఎర్రటి వర్ణంలో దర్శనమివ్వనున్నారు. దాదాపు 150 సంవత్సరాల తర్వాత కనిపిస్తున్న ఈ వింతను ఎలాంటి పరికరాలు అవసరం లేకుండానే చూడవచ్చట. మిగతా దేశాల కంటే మనదేశంలోనే చాలా స్పష్టంగా మనం చూసే అవకాశం ఉంది. అందుకే దీనిని "బ్లడ్‌మూన్‌" లేదా "కాపర్‌మూన్‌" అంటున్నారు. అసలు విషయం ఏంటంటే.. భూమికి చంద్రుడు అతి దగ్గరగా రావడం, సంపూర్ణ చంద్రగ్రహణం వంటివి ఒకేసారి రావడంతో చంద్రుడు రాగి రంగులో కనువిందు చేయనున్నాడు. భూమికి దగ్గరగా రావడం వల్ల చంద్రుడు పెద్దగా, ప్రకాశవంతంగా కనిపి౦చనున్నాడు. మామూలు రోజుల్లో కనిపించే చందమామతో పోలిస్తే 14 శాతం పెద్దగా, 30 శాతం కాంతిమంతంగా దర్శనమివ్వనున్నట్లు ఆస్ట్రోనామికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా బృందం వెల్లడించింది. జనవరి 31 సాయంత్రం 6:22 కు మొదలయ్యే ఈ ఖగోళ సంబరం సుమారు 7:38 నిమిషాల వరకూ కొనసాగనుంది.