పాక్ పై ఘన విజయం సాధించిన భారత్...

SMTV Desk 2018-01-30 10:15:37  icc under-19, india, pakistan, subhaman gil, australia

క్రైస్ట్‌చర్చ్, జనవరి 30: ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీలో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన పృథ్వి సేన టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. దాయాది దేశం పాక్ తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా జట్టు 203 పరుగుల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుని ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. తొలుత టాస్ నెగ్గిన బ్యాటింగ్ ను ఎంచుకున్న భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. శుభ్‌మాన్‌ గిల్ సెంచరీ (102, నాటౌట్)తో ఆదరగోట్టేశాడు. పృథ్వీ షా(41), మన్‌జ్యోత్‌ కల్రా(47), సుధాకర్‌ రాయ్‌(33) రాణించారు. అనంతరం లక్ష్య చేధనలో పాకిస్తాన్ జట్టు టీమిండియా బౌలింగ్ ధాటికి 29.3 ఓవర్లలో 69 పరుగులకే కుప్పకూలిపోయింది. టీమిండియా బౌలర్ ఇషాన్ పోరెల్ (4/17) ధాటికి పాక్ విలవిలలాడిపోయింది. సెంచరీ వీరుడు శుభ్‌మాన్‌ గిల్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. కాగా ఫిబ్రవరి 3న జరిగే ఫైనల్లో భారత్‌, ఆస్ట్రేలియా జట్లు అమీ తుమీ తేల్చుకోనున్నాయి.