కోహ్లి జీరో గ్రావిటీ జంప్ చూశారా..!

SMTV Desk 2018-01-29 19:04:29  virat kohli, india, south africa, freedom series,

జోహానెస్‌బర్గ్‌ : విరాట్ కోహ్లి... భారత్ క్రికెట్ కెప్టెన్ గా జట్టుకు ఎన్నో విజయాలు అందిస్తున్న ఘనుడు. కోహ్లి మైదానంలో చాలా ఉత్సాహంగా ఉంటాడు. అంతే కాకుండా తన కోపాన్ని, ఆనందాన్ని మైదానంలో ప్రదర్శించిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా సఫారీలతో జరిగిన మూడో టెస్టులో విరాట్ సేన చిరస్మరణీయ విజయం సాధించి వైట్ వాష్ బారి నుండి తప్పించుకొన్న విషయం తెలిసిందే. ఈ టెస్టులో నాయకుడు కోహ్లీ పేస్ పిచ్‌పై ప్రోటీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని రెండు ఇన్నింగ్స్‌ల్లో విలువైన పరుగులు(54, 41) చేసి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. అయితే ఈ టెస్టు‌లో కోహ్లీ.. తన బ్యాట్‌తో చేసిన విన్యాసాల కంటే ఇతర విన్యాసాలే ఇప్పుడు అభిమానులను ఎక్కువగా ఆకట్టుకున్నాయి. ఈ టెస్టులో విజయోత్సాహంతో కోహ్లీ చేసిన జంప్‌ల గురించి ఇప్పుడు అభిమానులు అంతర్జాలంలో ప్రముఖంగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఏబీ డివిలియర్స్‌ ఔట్‌ అయిన సందర్భంలో కోహ్లీ గాల్లోకి ఎగిరి చేసిన విన్యాసం పై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొన్ని కామెంట్లు... * ‘భార్య అనుష్క సినిమా ‘జీరో’ను ప్రమోట్‌ చేసేందుకు కోహ్లీ ఇలా జీరో గ్రావిటీ జంప్‌ చేశాడేమో’ * ‘కోహ్లీ జంప్‌ అద్భుతం. నమ్మశక్యం కావడం లేదు’ * ‘కోహ్లీ క్రికెటర్‌ కాకుండా ఉంటే.. ఒలింపిక్స్‌ హై జంప్‌లో భారత్‌కు పతకాలు వచ్చేవే’