క్రిప్టోకరెన్సీ పై పంజా విసిరిన హ్యాకర్లు..

SMTV Desk 2018-01-29 17:16:36  japan, bit coin, Cryptocurrency , hacking, rbi

టోక్యో, జనవరి 29: బిట్‌కాయిన్స్‌.. కనిపించవు, ఎలా ఉంటాయో తెలియదు. కానీ ప్రస్తుతం ప్రపంచం విపణిలో బాగా విపిస్తున్న, దూసుకెళ్తున్న పేరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ దేశానికి చెందని అంతర్జాతీయ ఊహాజనిత ద్రవ్యం. ఈ క్రిప్టోకరెన్సీని చాలా మంది విరివిగా వాడుతున్నారు. ఇప్పటికే కేంద్రం, ఆర్బీఐ భారత్ లో వీటిని నమ్మవద్దుని ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆదాయపుపన్ను శాఖకు చిక్కకుండా.. వీటిపై డబ్బు ఇన్వెస్ట్‌ చేయడం మంచిదని అని చాలామంది భావిస్తుంటారు. తాజాగా అదంత భద్రమైంది కాదని తేలింది. జపాన్‌లోని ‘కాయిన్‌చెక్‌’ బిట్‌కాయిన్‌/క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్‌పై హ్యాకర్లు పంజా విసిరారు. 380 మిలియన్‌ పౌండ్ల విలువ గల క్రిప్టోకరెన్సీ ని హ్యాక్ చేశారు.