ప్రేమికుడే కాలయముడయ్యాడు...

SMTV Desk 2018-01-29 12:51:52  murder, beedhar, lovers, karnataka

బీదర్‌, జనవరి 29: ప్రేమ... రెండక్షరాల మధురపదం. కానీ ఇదే ప్రేమ ఇప్పుడు చావు అనే మరో రెండక్షరాల పదానికి దగ్గర చేసి యువతీ యువకుల నిండు జీవితాన్ని బలిగొంటుంది. వయసు మోజులో, క్షణికావేశంలో నిజమైన ప్రేమను తెలుసుకోలేక క్రూర మృగాళ్ల చేతిలో తనువులు చాలిస్తున్న అభాగ్యులు ఎంతో మంది.. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలోని భాల్కి తాలుకా గాయముఖ అటవీ ప్రాంతంలో శనివారం మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కోసం గ్రామానికి చెందిన ఓ యువతి, శంషుద్దీన్‌ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా శంషుద్దీన్‌ సూచన మేరకు ఆమె ఒంటరిగా అటవీ ప్రాంతానికి వెళ్లింది. తరువాత ఎం జరిగిందో గాని యువతిని హత్య చేసి ఆమె పాలిట కాలయముడుగా మారాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. హతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు ధన్నూర పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.