‘జమిలి’ కు మేము వ్యతిరేకం : నితీష్ కుమార్

SMTV Desk 2018-01-29 11:19:44  nitish kumar, jdu, bji, jameli elections, patna

పాట్నా, జనవరి 29 : ప్రధాని మోదీ దేశంలో ఒకేసారి (లోక్ సభ, అసెంబ్లీ) ఎన్నికల జరగాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియపై చాలా మంది ప్రముఖులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జమిలి ఎన్నికల విధానంకు అంగికరించబోమని తెలిపారు. దేశంలో(లోక్‌సభ-రాష్ట్రాలకు) ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న మోదీ ఆశయం నెరవేరే పని కాదని.. అందుకు తాను కూడా వ్యతిరేకినేనని నితీశ్‌ సంచలన ప్రకటన చేశారు. తాజాగా ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ...” దేశంలో ఒకేసారి ఎన్నికల నిర్వహణ సరైన ఆలోచన విధానం కాదు. ఇటీవల గుజరాత్ లో ఎన్నికలు జరిగాయి. మరికొద్ది రోజుల్లో కర్ణాటకలో ఎన్నికల సమరం జరగనుంది. ఈ రెండు రాష్ట్రాలూ ఏడాదిలోనే మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతాయని ఎలా భావిస్తారు?” అని వెల్లడించారు. ప్రస్తుతం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) ప్రభుత్వం బీజేపీ మిత్ర పక్షంగా ఉంది.