గతేడాది మేటి పదంగా ‘ఆధార్‌’..

SMTV Desk 2018-01-28 22:07:01  AADHAR, WORD OF 2017, JAIPUR, GORAKSHAK,

జైపూర్‌, జనవరి 28 : ప్రస్తుతం భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడుకు అవసరమవుతున్న అతి ముఖ్యమైన గుర్తింపు ‘ఆధార్‌ కార్డ్’. కాగా ‘ఆధార్‌’కు 2017 సంవత్సరపు హిందీ పదంగా గుర్తింపు లభించింది. జైపూర్‌ సాహితీ వేడుకలో భాగంగా శనివారం ‘ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీస్‌’ అంశంపై జరిగిన చర్చలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆధార్‌ తర్వాత మిత్రోన్‌(అసలు రూపం మిత్రో), నోట్‌బందీ, గోరక్షక్‌ అనేవి హిందీ పదాలు కూడా బాగా ప్రాముఖ్యత పొందినట్లు వివిధ రంగాల నిపుణులు వెల్లడించారు. ‘మిత్రోం’, ‘నోట్‌బందీ’, ‘గోరక్షక్‌’ వంటి పదాలను కూడా పరిశీలించినప్పటికీ ‘ఆధార్‌’పైనే చర్చలు, వివాదాలు నడుస్తున్నందున అది గత ఏడాది మేటి పదంగా నిలిచిందన్నారు