ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ ఫెదరర్‌దే...

SMTV Desk 2018-01-28 20:23:52  Roger Federer, win australian open, marin cilic, melborn

మెల్‌బోర్న్‌, జనవరి 28 : స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్ ను తన వశం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఆరో సీడ్ సిలిచ్‌(క్రోయోషియ)పై 6-2, 6-7, 6-3, 3-6, 6-1 తేడాతో విజయం సాధించి కెరీర్ లో 20 వ గ్రాండ్ స్లామ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆద్యంతం హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్ లో ఫెదరర్ ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. ఈ టైటిల్ గెలవడంతో ఫెడిక్స్ ఆరు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన, నోవాక్‌ జొకోవిక్‌, ఆస్ట్రేలియన్‌ గ్రేటర్‌ రాయ్‌ ఎమెర్సన్ల సరసన నిలిచాడు. అంతకుముందు 2004, 2006, 2007, 2010, 2017 సంవత్సరాల్లో ఛాంపియన్‌గా అవతరించాడు.