టాటూ వేసుకున్నారా.? ఇక అంతే..

SMTV Desk 2018-01-28 18:24:52  tatoo, indain air force, job cancelled.

న్యూఢిల్లీ, జనవరి 28 : నేటి యువత ఎక్కువగా టాటూలు వేసుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఎవరి ఒంటిపై చూసిన ఇప్పుడు టాటూలు సర్వసాధారణం అయిపోయాయి. ఈ ఊబిలో పడి యువత ఏం కోల్పోతున్నారో తెలుసా.? ఉద్యోగాలను.. అవును.. వాయు సేనలో ఎయిర్‌మెన్‌ ఉద్యోగంలో చేరబోయే వ్యక్తి తన మోచేతులపై వేసుకున్న టాటూ వల్ల ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అసలు విషయం ఏంటంటే.. 2016లో ఎయిర్‌మెన్‌ ఉద్యోగానికి ఎంపికైన ఉద్యోగికి నిబంధనలకు విరుద్ధంగా తన ఒంటిపై ఉన్న టాటూలు అడ్డుగా మారాయి. అతన్ని అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో సదురు ఉద్యోగి ఢిల్లీ హైకోర్టులో పిటీషన్‌ వేయగా ఇది నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలడంతో న్యాయస్థానం అతని పిటిషన్‌ను తిరస్కరించింది. కాని గిరిజనుల సంప్రదాయాల దృష్ట్యా వారికి మాత్రం ఈ నిబంధన నుండి మినహాయింపు ఉంది.