అమెరికాలోనూ "భాగమతి" దూకుడు..

SMTV Desk 2018-01-28 16:30:13  bagamathi movie, collections, america, anushka.

హైదరాబాద్, జనవరి 28 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన "భాగమతి" చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. "భాగమతి" గా అనుష్క నటన విమర్శకులను సైతం మెప్పించింది. జి.అశోక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇటు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా అటు అమెరికాలోనూ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా 542వేల డాలర్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు వెల్లడించారు. అన్ని థియేటర్లు హౌస్ ఫుల్ అయినట్లు పేర్కొన్నారు.