బోరు బావిలో చిన్నారి

SMTV Desk 2017-06-23 15:26:06  chid, protecation, borwel

రంగారెడ్డి, జూన్ 23 : బోరు బావిలను చూస్తుంటే మృత్యు గుహల్లా కనిపిస్తున్నాయి. అన్యంపుణ్యం తెలియని చిన్నారులు ఆడుకుంటు వెళ్లి బోరు బావిలో పడి విలవిలలాడుతున్నారు. ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వికారాబాద్ జిల్లా యాలాల మండలం బోరపల్లి గ్రామానికి చెందిన యాదయ్య, రేణుక దంపతులు. వీరికి అక్షిత, వీణా కుమార్తెలు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్ వెల్లి అనుబంధ గ్రామమైన ఇక్కారెడ్డి గూడలోని రాంరెడ్డి అనే వ్యక్తి వద్ద యాదయ్య, రేణుక లు కూలీలుగా పని చేస్తున్నారు. పొలం పనులు చేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్నారు. గురువారం సాయంత్రం అక్షిత, వీణా లు ఆడుకుంటున్న సమయంలో వీణా ప్రమాదవశాత్తు బోరు బావిలో పడింది. ఇది గమనించిన అక్షిత తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న నాలుగు జేసీబీ లతో తవ్వకాలు చేపట్టారు. సుమారు 540 అడుగుల లోతున్న బోరు బావిలో, 40 అడుగుల దగ్గర మోటార్ ఉండటంతో అక్కడ చిన్నారి చిక్కుకొని ఉండవచ్చని పోలీసులు అంచన వేస్తున్నారు. 108 సహాయంతో చిన్నారికి ఆక్సిజన్ అందిస్తూ, ప్రత్వేక కెమెరాను లోపలికి పంపి బాలిక ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. అనేక బృందాలతో చిన్నారిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.