"పద్మ" పురస్కారోత్సవం...

SMTV Desk 2018-01-26 16:07:04  PADMA BHUSHAN, PADMASRI, AWARDS, CENTRAL AWARDS.

న్యూఢిల్లీ, జనవరి 26 : కేంద్ర హోంశాఖ గణతంత్ర వేడుకల సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటించింది. 85 మందికి పద్మ పురస్కారాలు దక్కాయి. భారతదేశ అత్యుత్తమ రెండవ పురస్కారమైన పద్మవిభూషణ్ సంగీతంలో స్వరబ్రహ్మ ఇళయరాజాకు, గులాం ముస్తఫా ఖాన్ కు.. సాహిత్యంలో కేరళకు చెందిన పరమేశ్వరన్ లకు లభించింది. పద్మభూషణ్ అవార్డులు తొమ్మిది మందిని వరించగా, పద్మశ్రీ ని 73 మంది దక్కించుకున్నారు. పద్మభూషణ్ ను క్రీడా రంగంలో మహేంద్రసింగ్ ధోని, పంకజ్ ఆడ్వాణి లతో పాటు.. మరో ఏడుగురు వివిధ రంగాలలో ఈ అవార్డు పొందారు. తెలుగు యువ తేజం కిదా౦బి శ్రీకాంత్ కు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఎన్నారైలకు, విదేశీయులకు(16) అవార్డులు రాగా.. మహారాష్ట్ర(11), కర్ణాటక (9), తమిళనాడు(6), పశ్చిమబెంగాల్(5), కేరళ(4), మధ్యప్రదేశ్(4), ఒడిశా(4), ఉత్తర ప్రదేశ్(3), గుజరాత్(3), అస్సోం(3) పురస్కారాలు సొంతం చేసుకున్నాయి.