"గణతంత్ర౦" సందర్భంగా సినీ ప్రముఖుల శుభాకాంక్షలు

SMTV Desk 2018-01-26 13:23:52  cini industry, republic day wishes, social media.

హైదరాబాద్, జనవరి 26 : దేశమంతటా 69వ గణతంత్ర వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. పతక ఆవిష్కరణలు, రకరకాల విన్యాసాల మధ్య ఈ వేడుకలు కనుల పండువగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియా వేదికగా సినీ ప్రముఖులు అభిమానులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. * సారే జహాసే అచ్చా. హిందుస్థాన్‌ హమారా.. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్‌ - అమితాబ్ * మనం గణతంత్ర దినోత్సవం జరుపుకునేలా చేసినందుకు ఆర్మీ జవాన్లకు సెల్యూట్ - అజయ్ దేవగన్ * దేశం ఒకటే. ప్రజలందరూ ఒక్కటే. జెండా కూడా ఒక్కటే - కాజోల్ * భిన్నత్వంలోనే ఏకత్వం అన్నది మన నినాదం. అందుకే శాంతి పథంలో పయనించాలని ప్రపంచం మనల్ని కోరుకుంటోంది - మోహన్ బాబు * ఈ గణతంత్ర దినోత్సవం నాడు మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. మన రాజ్యాంగం భిన్నత్వంలోనే ఏకత్వం అన్న నినాదాన్ని పాటించాలని మనకు సూచిస్తుంది. ఇప్పటికీ ఎప్పటికీ ఐకమత్యంగానే ఉందాం. జై హింద్‌ - కుష్బూ * ఎంత దూరం వచ్చామన్నది కాదు ఇంకెంత దూరం ప్రయాణిస్తామన్నదే ముఖ్యం. జై హింద్‌ - అర్జున్‌ కపూర్‌ * నా భారతీయ ప్రజలందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశాన్ని ఇప్పటికీ, ఎప్పటికీ ప్రశాంతతే పాలిస్తుందని ఆశిస్తున్నాను - మంచు లక్ష్మి * ప్రపంచంలో మార్పు చూడాలనుకుంటే అది మనతోనే రావాలి. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు - సమంత * కలిసుంటే నిలబడతాం. విడిపోతే పడిపోతాం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్ - అనుష్క శర్మ * అన్నింటికన్నా ముందు నేను భారతీయుడిని. జై హింద్‌ - రితేశ్‌ దేశ్‌ముఖ్‌