కేసీఆర్ పరిపాలన ఒక సమాధానం : ఈటల

SMTV Desk 2018-01-25 17:46:37  minister, eetala rajendar, comments on kcr

హైదరాబాద్, జనవరి 25 : దేశంలోని ఇతర రాష్ట్రాలన్ని తెలంగాణ వైపు చూస్తున్నాయని ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నగర శాఖ రూపొందించిన డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యపైన ప్రభుత్వానికి ఒక అవగాహన ఉందన్నారు. అంతేకాకుండా ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న వారందరికి కేసీఆర్ పాలనే ఒక సమాధానం అవుతుంది అని వ్యాఖ్యానించారు.