గజల్‌ శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు..

SMTV Desk 2018-01-24 16:55:04  gajal srinivas, bail issued, nampally court, harassment case.

హైదరాబాద్, జనవరి 24 : లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన గజల్‌ శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. అలాగే రూ.10వేల జరిమానాను కూడా విధించింది. ఇదే కేసులో ఏ2 నిందితురాలుగా ఉన్న పార్వతికి సైతం ముందస్తు బెయిల్‌ను మంజూరు చేశారు. శ్రీనివాస్‌ ప్రతి బుధ, ఆదివారాల్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. కాగా మహిళను లైంగికంగా వేధించిన కేసులో గజల్ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ మెట్రోపాలిటన్ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌ తిరస్కరణకు గురి కావడంతో నాంపల్లి సెషన్స్‌ కోర్టును ఆశ్రయించాడు.