ఉత్తమ చిత్రం : ‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’..

SMTV Desk 2018-01-24 12:36:27  sachin tendlukar, biopic, sachin a billion dreams, fictc awards

న్యూఢిల్లీ, జనవరి 24 : భారత్ క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా గత ఏడాది వచ్చిన ‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా 11వ టెహ్రాన్‌ ఇంటర్నేషనల్‌ ఎఫ్‌ఐసీటీఎస్‌ ఫెస్టివల్‌-2018లో బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ ఫిల్మ్‌ అవార్డును దక్కించుకుంది. బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డును ఎరిక్సన్‌, బెస్ట్‌ ఫిల్మ్‌ అవార్డును నిర్మాత రవి భాగ్‌చంద్క అందుకున్నారు. జనవరి 16 నుంచి 18 వరకు జరిగిన ఈ ఫెస్టివల్‌లో డాక్యుమెంటరీ విభాగంలో పలు దేశాలకు చెందిన సినిమాల నుంచి ‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’కు గట్టి పోటీ ఎదురైంది. వాటన్ని౦టినీ అధిగమించి ఈ చిత్రం ఈ అవార్డులను అందుకొంది.