ఆందోళన కలిగిస్తున్న "హిమ" హెచ్చరికలు

SMTV Desk 2018-01-23 17:43:07  World Economic Summit, dovos, prime minister modi, snow problems.

జ్యూరిచ్, జనవరి 23 : దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేత్తల సదస్సు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్‌లో హిమపాతం హెచ్చరికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. లెవెల్‌ 5 హిమపాతాలు సంభవించే అవకాశం ఉందంటూ ఈ మేరకు హిమపాతాల రీసెర్చ్‌ కేంద్రం ఎస్‌ఎల్‌ఎఫ్‌ ఈ హెచ్చరికలు జారీ చేసింది. అంతే కాకుండా మంచు బాగా పేరుకుపోతే ప్రయాణాలకు కూడా తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ క్రమంలో మంచు కారణంగా దావోస్‌లో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల నుంచి సుమారు 25 మంది ప్రజలను అధికారులు వేరే ప్రాంతానికి తరలించారు. కాగా ఈ దావోస్ లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేత్తల సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే దావోస్‌ వెళ్లిన విషయం తెలిసిందే.