కోర్టులో మళ్లీ పిటిషన్‌ దాఖలు చేసిన ఆప్ నేతలు...

SMTV Desk 2018-01-23 14:05:04  Aam Aadmi Party, disqualified legislators, ec, president

న్యూఢిల్లీ, జనవరి 23 : లాభదాయక పదవులు చేపట్టారని 20 మంది ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలపై ఈసీ చేసిన సిఫార్సుల మేరకు రాష్ట్రపతి అనర్హత వేటు వేసిన సంగతి విధితమే. అయితే ఈ విషయంపై ఆ పార్టీ రాష్ట్రపతి ఆదేశాలను పూర్తిగా అధ్యయనం చేసిన అనంతరం మళ్లీ పిటిషన్‌ దాఖలు చేస్తామని నిన్న ఆప్‌ తరపు న్యాయవాదుల కౌన్సిల్ వెల్లడించారు. దీనిపై కోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. కోర్టులో మొదట దాఖలు చేసిన పిటిషన్‌ను నిన్న ఆప్‌ వెనక్కి తీసుకుంది. మరో వైపు ఆప్ వర్గాలు ఆ 20 స్థానాలకు ఉపఎన్నికలు జరిగితే ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆప్ కి 70 స్థానాలకు గాను, 66 సీట్లు ఉన్నాయి. ఈ 20 మంది అనర్హులైతే ఆ సంఖ్య 46కు పడిపోతుంది. ఒక వేళా ఎన్నికలు జరిగిన కేజ్రివాల్ ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే మెజార్టీ మార్క్‌ 35 కంటే ఎక్కువ మందే ఉన్నారు.