ప్చ్...జకోవిచ్

SMTV Desk 2018-01-23 13:22:54  australia open 2018, Novak Djokovic, Roger Federer, melborne

మెల్ బోర్న్, జనవరి 23 : ఆస్ట్రేలియా ఓపెన్ లో మరో సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన మాజీ నెంబర్ వన్, సెర్బియా యోధుడు నొవాక్‌ జకోవిచ్‌ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. గాయం కారణంగా ఆరు నెలలు ఆటకు దూరమైనా జకోకు, అతని అభిమాని అయిన దక్షిణ కొరియా కుర్రాడు చంగ్‌ గట్టి షాకిచ్చాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 14వ ర్యాంకర్‌ జకోవిచ్‌, 58వ ర్యాంకు ఆటగాడు చంగ్‌ చేతిలో ఓటమి చవిచూశాడు. మరో వైపు స్విస్ దిగ్గజ ఆటగాడు రోజర్‌ ఫెదరర్‌, ఫుస్కోవిక్స్‌ పై విజయం సాధించి టోర్నీలో 14 వ సారి క్వార్టర్స్‌ లోకి ప్రవేశించాడు. మరో ప్రిక్వార్టర్స్‌లో థామస్‌ బెర్డిచ్‌, ఫాగ్‌నిని (ఇటలీ)పై విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన పోరులో అమెరికా ఆటగాడు టెన్నిస్‌ సాండ్‌గ్రిన్‌ థీమ్‌కు షాకిచ్చాడు. మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌ సిమోనా హలెప్‌ (రుమేనియా), ఏంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ) క్వార్టర్‌ఫైనల్‌ లో అడుగు పెట్టారు. క్వార్టర్సలో ఎవరితో ఎవరు? పురుషులు.. నాదల్(స్పెయిన్) X సిలిచ్ (క్రొయోషియ) దిమిత్రోవ్(బల్గేరియా) X ఎడ్మండ్(బ్రిటన్) సాండ్‌గ్రిన్‌(అమెరికా) X చంగ్ (దక్షిణ కొరియా) ఫెదరర్(స్విట్జర్లాండ్) X బెర్డిచ్‌ (చెక్ రిపబ్లిక్) మహిళలు.. హలెప్‌ (రుమేనియా) X ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) కెర్బర్ (జర్మనీ) X మాడీసిన్ కీస్ (అమెరికా) స్వితోలినా (ఉక్రెయిన్) X మెర్టిన్స్ (బెల్జియం) వోజ్నియోకి ( డెన్మార్క్) X నవారో (స్పెయిన్)