రైలు ఛార్జీలపై జీఎస్టీ ప్రభావం

SMTV Desk 2017-06-22 15:32:22  gst, railway, charges, july 1, tickets,

న్యూ ఢిల్లీ, జూన్ 22 ; దేశంలో జీఎస్టీ వస్తు, సేవల పన్ను ప్రభావంతో స్వల్పంగా రైలు ప్రయాణ ఛార్జీలు పెరగనున్నాయి. జూలై 1 నుంచి అమలులోకి రానున్న జీఎస్టీ సేవ పన్ను రైల్వే టిక్కెట్ల పై పన్ను భారం పడనుంది. ఈ మేరకు ప్రయాణికులు 4.5 నుంచి 5 శాతం సేవా పన్ను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రైల్వేల్లో ఏసీ, ఫస్ట్ క్లాస్ బోగి ప్రయాణికుల ఛార్జీల పైనే సర్వీస్ టాక్స్ విధిస్తున్నారు. ఉదాహరణకు ప్రయాణ టిక్కెట్ ధర రూ. 2000 ఉంటే జీఎస్టీ అమలు తర్వాత రూ. 2010 చెల్లించాల్సి ఉంటుంది. సజావుగా జీఎస్టీ అమలు కోసం రైల్వే శాఖ ఒక్కో రాష్ట్రానికి ఒక నోడల్ అధికారిని నియమించినట్లు సమాచారం.