29, 30 తేదీల్లో తెలంగాణ బాలోత్సవ్..

SMTV Desk 2018-01-21 11:23:11  telangana balotsav competitions, minister talasaani yaadav, poster release.

హైదరాబాద్, జనవరి 21 : తెలంగాణ రాష్ట్ర బాలోత్సవ్ కార్యక్రమాన్ని ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహి౦చనున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ పి. సంపత్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బాలోత్సవ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పిల్లల కోసం ఏర్పాటు చేసే ఈ ఉత్సవాల్లో ప్రధానంగా సాంప్రదాయ, జానపద నృత్యాలు, పాటలు, ఫ్యాన్సీ డ్రస్ కాంపిటీషన్స్‌తో పాటు పలు రకాల పోటీలను నిర్వహిస్తున్నామని సంపత్ తెలిపారు. ఆసక్తి కలిగిన చిన్నారులు ఈ ఉత్సవాల్లో పాల్గొనే౦దుకు 9676610269 నెంబరును సంప్రదించాలని కోరారు. ఈ వేడుకలకు హాజరయ్యే చిన్నారులు, తల్లిదండ్రులకు ఉచిత భోజన వసతి కల్పించనున్నట్లు వెల్లడించారు.