మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ గా ఆనంది బెన్‌ పటేల్‌

SMTV Desk 2018-01-20 15:10:44  aanandiben patel, governor, madhyapradesh, rastrapati bhavan, tweet

న్యూఢిల్లీ, జనవరి 20: గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత ఆనంది బెన్‌ పటేల్‌ మధ్యప్రదేశ్‌ తదుపరి గవర్నర్‌గా నియమితులయ్యారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌కు ఆమెను గవర్నర్‌గా రాష్ట్రపతి నియమించినట్టు రాష్ట్రపతి భవన్‌ ట్విట్టర్‌లో వెల్లడించింది. ఆనంది బెన్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. 2014లో నరేంద్రమోదీ గుజరాత్‌ సీఎం పదవికి రాజీనామా చేసి.. ప్రధానమంత్రి పదవి చేపట్టడంతో ఆయన స్థానంలో ముఖ్యమంత్రిగా ఆనంది బెన్‌ నియమితులయ్యారు. పటీదార్‌ రిజర్వేషన్ల ఆందోళన, ప్రభుత్వ వ్యతిరేకత తదితర కారణాల వల్ల ఆమె రెండేళ్లకు మించి సీఎం పదవిలో ఉండలేకపోయారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ గా ఓం ప్రకాశ్‌ కోహ్లి వ్యవహరిస్తున్నారు. 2016 నుంచి గుజరాత్‌ బాధ్యతలు అదనంగా చూస్తున్నారు.