ప్రజల స్పందన బట్టే ప్రభుత్వ నిర్ణయం : ఈటల

SMTV Desk 2018-01-20 14:59:28  FINACILA MINISTER, EETALA RAJENDER, GST, PROBLEMS.

హైదరాబాద్, జనవరి 20 : జీఎస్టీ వల్ల ఇబ్బందులు ఉన్నాయంటూ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. లక్డీకాపూల్‌లోని అశోక హోటల్‌లో ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ గెజిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రాలలో జీఎస్టీ వల్ల ఇంకా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ప్రజల స్పందనను బట్టి ప్రభుత్వ౦ నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. కేంద్రం చేతుల్లోకే పన్నులు మొత్తం వెళ్తుండడంతో రాష్ట్రాలు మరిన్ని కొత్త పథకాలపై సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాయని వెల్లడించారు.