నిలిచిపోయిన అమెరికా వార్షిక లావాదేవీలు..!

SMTV Desk 2018-01-20 13:09:52  American Annual transactions, cancelled, democrats, republicans, american govt.

వాషింగ్టన్, జనవరి 20 : అమెరికా ప్రభుత్వ వార్షిక లావాదేవీలు నిలిచిపోయాయి. జనవరి 19లోగా యూఎస్‌ సెనేట్‌లో ద్యవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. కాని నిర్ణీత వ్యవధిలో బిల్లు ఆమోదం పొందకపోవడంతో ప్రభుత్వ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. ఇలా అమెరికా ప్రభుత్వం మూతపడటం ఇది 12వ సారి. ఈ కారణంగా రూ.42వేల కోట్ల నష్టం వాటిల్లనుందని అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తోంది. అమెరికన్ డెమోక్రాట్లు, రిపబ్లికన్‌ సభ్యుల మధ్య రాజీ కుదరకపోవడంతో ఈ బిల్లు ఆమోదం పొందకపోవడానికి ముఖ్య కారణంగా తెలుస్తోంది. దీంతో ఉద్యోగులకు 40రోజుల పాటు వేతనం లేని సెలవులను అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.