"ఎన్టీఆర్" ఫ‌స్ట్ లుక్ విడుదల..

SMTV Desk 2018-01-18 18:27:48  ntr movie first look release, bala krishna, new movie.

హైదరాబాద్, జనవరి 18 : నటసౌర్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి బాలయ్య ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి "ఎన్టీఆర్" అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు. కాగా ఎన్టీఆర్ 23వ వ‌ర్థంతి సందర్భంగా ఆ చిత్ర ఫ‌స్ట్ లుక్ ను విడుదల చేశారు. వాహనంపై నిలబడి చేతిలో మైక్‌ పట్టుకున్న ఫోటోపై "ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయంగా జీవించిన ఓ మహానుభావునికి ఇదే మా నివాళి" అని క్యాప్షన్‌ పెట్టారు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొంద‌నున్న ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి స్వ‌రాలు స‌మ‌కూర్చ‌నున్నారు. విష్ణు ఇందూరి, సాయి కొర్ర‌పాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. మిగతా విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.