"కోహ్లి"@ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌

SMTV Desk 2018-01-18 17:29:27  kohli, icc sir garfield sobers trophy, player of the year awards.

దుబాయ్, జనవరి 18 : టెస్టు, వన్డే, టీ20 ఈ మూడు ఫార్మాట్లలోనూ విశేష ప్రతిభ కనబరిచిన ఆటగాడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా 2017లో అంతర్జాతీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకుగాను టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కింగ్‌ కోహ్లీ.. ఐసీసీ సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబెర్స్‌ ట్రోఫీని అందుకున్నాడు. కోహ్లి ఈ అవార్డును అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీ౦తో పాటు ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును సైతం కోహ్లినే దక్కించుకున్నారు. కాగా ఈ అవార్డును కోహ్లి అందుకోవడం ఇది రెండోసారి. కాగా గతేడాది కోహ్లీ 76.84 సగటుతో ఆరు శతకాలు నమోదు చేశాడు. 29 ఏళ్ల వయసులోనే వన్డేల్లో 32 శతకాలు సాధించిన ఘనత విరాట్ సొంతం. ఇదిలా ఉండగా భారత యువ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్‌.. ఐసీసీ టీ20 ఫర్‌ఫామెన్స్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో చాహల్‌ అద్భుత ప్రదర్శన చేసినందుకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.