హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని : కేటీఆర్

SMTV Desk 2018-01-18 16:57:08  IT Minister KTR, INDIA TODAY MEETING, KTR RESPOND TO TWITTER.

హైదరాబాద్, జనవరి 18 : దేశానికి హైదరాబాద్ నగరం ఎప్పటికి రెండవ రాజధాని అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఇండియాటుడే సౌత్‌కాంక్లేవ్-2018 సదస్సు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్‌దేశాయ్.. దేశానికి రెండు రాజధానులు ఉండాలని అది కూడా హైదరాబాదే కావాలని అభిప్రాయపడుతూ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ కు స్పందించిన కేటీఆర్.. "రాజ్‌దీప్ ఈ సందర్భంగా మీకో విషయం చెప్పాలనుకుంటున్నా. దేశంలో రాజధాని తర్వాత రాష్ట్రపతి నిలయం ఉన్న ఏకైక నగరం హైదరాబాద్. ప్రతి సంవత్సరం భారత రాష్ట్రపతి ఈ మహానగరానికి విచ్చేస్తుంటారు. హైదరాబాద్ నగరం అధికారికంగా ప్రకటించకపోయినా.. హైదరాబాద్ ఎప్పుడూ దేశానికి రెండో రాజధానిగా కొనసాగుతుంది" అన్నారు.