ప్రజా రవాణా వాహనాలలో జీపీఎస్‌ తప్పనిసరి : రవాణాశాఖ

SMTV Desk 2018-01-18 13:26:14  GOVT VEHICLES, GPS SYSTEM, MANDATORY, TRANSPORT DEPARTMENT.

న్యూఢిల్లీ, జనవరి 18 : ప్రజా రవాణా వాహనాలలో తప్పనిసరిగా జీపీఎస్‌ సిస్టమ్‌ ఉండాల్సిందేనని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ నిబంధనలను అమలులోకి తీసుకురాగా, కొన్ని రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయకపోవడంతో రవాణాశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఏప్రిల్‌ 1వ తేదీలోగా అన్ని ప్రజా రవాణా వాహనాలైనా బస్సులు, ట్యాక్సీల్లో జీపీఎస్‌ సిస్టమ్‌, పానిక్‌ బటన్‌ లను ఏర్పాటు చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. * జీపీఎస్‌, పానిక్‌ బటన్‌.. లు పోలీస్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానించి ఉండడం వల్ల ఆపదలో ఉన్న ప్రయాణికులు పానిక్‌ బటన్‌ను నొక్కగానే విషయం పోలీసులకు, రవాణాశాఖకు చేరుతుంది. దీంతో బాధితులను జీపీఎస్‌ ద్వారా కనుక్కొని వారిని సురక్షితంగా రక్షించవచ్చు. * ఇటీవల ప్రయాణాల్లో మహిళలపై దాడులు ఎక్కువవుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా కేవలం మూడు చక్రాల వాహనాలు, ఈ-రిక్షాలకు మాత్రమే ఈ నిబంధనల నుండి మినహాయింపు కల్పించింది.