నేటి నుంచే అండర్‌-19 క్రికెట్ ప్రపంచకప్‌

SMTV Desk 2018-01-13 11:42:08  under 19cricket world cup, newzeeland, prudvi shaa, india team, start

విల్లింగ్టన్, జనవరి 13: నేటినుంచి కుర్రాళ్ళ అండర్‌-19 క్రికెట్ ప్రపంచకప్‌ సమరం న్యూజిలాండ్‌ వేదికగా మొదలవుతుంది. సీనియర్‌ జట్టు తరపున ఆడాలన్న కలను నేరవేర్చుకోవడానికి కుర్రాళ్లకు ఈ ప్రపంచకప్ సువర్ణావకాశం కానుంది. తొలి రోజు నాలుగు మ్యాచ్‌ల జరగనుండగా.. ఆదివారం ఆస్ట్రేలియా మ్యాచ్‌తో భారత-19 జట్టు తన టైటిల్‌ వేటను ఆరంభిస్తుంది. భారత్‌కు పృథ్వీ షా నాయకత్వం వహిస్తున్నాడు. నిరుడు ఫైనల్లో వెస్టిండీస్‌ చేతిలో ఓడి త్రుటిలో కప్పు చేజార్చుకున్న భారత జట్టు ఈసారి ఎలాగైనా ఛాంపియన్‌గా నిలవాలనే కృతనిశ్చయంతో ఉంది. భారత్‌ ఇంతకుముందు మూడుసార్లు అండర్‌-19 ప్రపంచకప్‌ను గెలుచుకుని సత్తా చాటింది. ఈ అండర్‌-19 ప్రపంచకప్‌లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. వెస్టిండీస్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మార్గనిర్దేశం చేస్తుండగా భారత అండర్‌-19 జట్టు టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. నాణ్యమైన ఓపెనర్లు, నిలకడగా ఆడుతున్న మిడిలార్డర్‌తో బ్యాటింగ్‌ లైనప్‌ దుర్భేద్యంగా కనిపిస్తోంది. విరాట్‌ కోహ్లి, స్టీవ్‌ స్మిత్‌, శిఖర్‌ ధావన్‌, యువరాజ్‌ సింగ్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది క్రికెట్‌ స్టార్లు గా వెలుగులోకి వచ్చింది ఈ యువ ప్రపంచకప్‌తోనే.