భారత్ బలహీన దేశం కాదు : ఆర్మీ చీఫ్‌

SMTV Desk 2018-01-12 17:25:57  army chief, bipin ravath, comments on chaina.

న్యూఢిల్లీ, జనవరి 12 : భారత్‌ మాత్రం బలహీనమైన దేశం కాదని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. ఉగ్రవాదంపై పోరు విషయంలో మీడియాతో మాట్లాడిన చీఫ్ పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "సరిహద్దులో చైనాను ఓడించే సత్తా మాకుంది. అంతేకాని భారత్‌ భూభాగాలపై చైనా ఆధిపత్యం చెలాయిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోము. చైనా శక్తిమంతమైన దేశమే కావొచ్చు.. కానీ భారత్‌ మాత్రం బలహీనమైనది కాదు" అంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఉగ్రవాదంపైన ఆయన స్పందిస్తూ.. "భవిష్యత్‌లో కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాలంటే.. మన దగ్గర అత్యాధునిక టెక్నాలజీ, ఆయుధాలు ఉండాలి. వాటి కోసమే మేం చూస్తున్నాం. కశ్మీర్‌తో పాటు ఇతర ప్రాంతాల భద్రతపై దృష్టి సారిస్తాం" అని వెల్లడించారు.