బాబా గుట్టు రట్టు

SMTV Desk 2017-06-21 17:00:47  babas, ladies, cash, gold

హైదరాబాద్, జూన్ 21 : నేటి సమాజంలో బాబాలుగా వేషం వేసుకొని చలామణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్నారు కొందరు. దానికి పాతబస్తీలో జరిగిన ఈ సంఘటనే నిదర్శనం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మోసిన్ అనే వ్యక్తి ఇటీవలే గల్ఫ్ దేశంలో ఉండి వచ్చాడు. వట్టేపల్లి ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఆనారోగ్యంతో బాధ పడుతూ చికిత్స నిమిత్తం బాబా దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. జహంగిరాబాద్ లో మోసిన్ అనే బాబా దగ్గరకు వెళ్ళింది. మోసిన్ బాబా... నీకు దెయ్యం పట్టింది, భూత ప్రేతం నీ శరీరంను అవహించాయి. ఈ జబ్బును తగ్గించడానికి ఖర్చు అవుతుందని చెప్పి ఆ మహిళను నమ్మించాడు. ఆమె దగ్గర నుండి రూ. 15 వేలతో పాటు వెండి, బంగారం వసూలు చేశాడు. తరువాత ఆమె కంటిలో నిమ్మకాయ రసం పిండి గాయపరిచి, కాళ్ళపై అగ్గి రగిలించి నడువలేని స్థితికి చేర్చాడు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ దొంగ బాబా సంఘటన వెలుగులోకి వచ్చింది. మోసిన్ పరారీలో ఉన్నట్లు, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.