విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంపై బహిరంగ చర్చకు సిద్దం : రేవంత్

SMTV Desk 2018-01-12 16:08:34  congress leader revanth reddy, comments on power plant scam.

హైదరాబాద్, జనవరి 12 : కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి.. పవర్‌ ప్లాంట్లలో భారీగా అవినీతి జరిగిందంటూ ఆరోపించారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించ తలపెట్టిన భద్రాద్రి, యాదాద్రి పవర్‌ ప్లాంట్లలో అక్రమాలు జరిగాయంటూ విమర్శించారు. సివిల్‌ వర్క్‌లు చేయని బీహెచ్‌ఈఎల్‌కు రూ.30,400కోట్లు టెండర్లు లేకుండా పనులు అప్పగించారని, ఇది కేవలం తమ అనుచరులకు లబ్ది చేకూర్చడానికే అంటూ విమర్శించారు. రాష్ట్రంలో ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయకపోగా అధిక ధరలకు పొరుగు రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలు చేస్తూ, ప్రజలపై అధిక భారం మోపారని రేవంత్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంపై 12వ తేదీన బహిరంగ చర్చకు తానూ సిద్దమని తెలిపారు.