శక్తివంతమైన ప్రపంచ నేతల్లో మోదీ @ న౦.3

SMTV Desk 2018-01-12 15:00:12  galap international society, servery, top 10 members.

న్యూఢిల్లీ, జనవరి 12 : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రపంచ ప్రముఖ నేతలలో మూడవ వ్యక్తిగా నిలిచారు. గాలప్‌ ఇంటర్నేషనల్‌ అనే సంస్థ ప్రపంచ ప్రముఖ నేతలపై ఓ సర్వే చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో ఈ సర్వే నిర్వహించి.. ఆ నేతలపై ప్రజల నుంచి అనుకూల, ప్రతికూల అభిప్రాయాలను సేకరించింది. వీటి మధ్య భేదం ఆధారంగా ర్యాంకులను కేటాయించింది. ఇందులో జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ మొదటి స్థానంలో నిలవగా.. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్‌ మేక్రాన్‌ రెండో ర్యాంకులో ఉన్నారు. ఏంజెలా మెర్కెల్‌ 20 పాయింట్ల నెట్‌ స్కోర్‌తో మొదటి స్థానంలో ఉండగా, 21పాయింట్ల నెట్‌ స్కోర్‌తో మేక్రాన్‌ రెండో ర్యాంకులో ఉన్నారు. ఇక భారత ప్రధాని 8 పాయింట్ల నెట్ స్కోర్‌తో ఈ జాబితాలో మూడోస్థానంలో నిలిచారు. బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ టాప్‌ టెన్‌లో ఉన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకోలేపోవడం గమనార్హం. * ఈ గాలప్‌ ఇంటర్నేషనల్‌ సర్వే ప్రకారం ప్రపంచస్థానంలో మొదటి 10 స్థానాలు సాధించిన ప్రముఖ నేతలు వీరే..! 1. జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ 2. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్‌ మేక్రాన్‌ 3. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 4. బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే 5. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ 6. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ 7. సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ 8. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతాన్యహు 9. ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ 10. టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్‌