సుప్రీం నోటీసులు అందుకున్న కేరళ సీఎం...

SMTV Desk 2018-01-11 14:44:19  KERALA CM, PANARAI VIJAYAN, SUPRIM COURT NOTICE, HYDERO ELECTRIC PROJECT.

న్యూఢిల్లీ, జనవరి 11 : అవినీతి కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. కేరళలోని హైడ్రోఎలక్ర్టిక్‌ ప్రాజెక్టుల పునర్నిర్మాణ పనులలో కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు, కెనడాకు చెందిన ఎస్‌ఎన్‌సీ లావలిన్‌ కంపెనీల మధ్య లావాదేవీల విషయంలో అవినీతి కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న విజయన్‌ ను కేరళ హైకోర్టు వదిలేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో సీబీఐ చేసిన అప్పీల్‌ను వినడానికి ధర్మాసనం అంగీకరించింది. ఈ కేసులో నిందితులందరికీ నోటీసులు పంపాలని సీబీఐ తరపు న్యాయవాది.. అదనపు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను కోరారు. దీంతో సీబీఐ అప్పీలును అంగీకరించిన కోర్టు నాలుగు వారాల్లోగా స్పందించాలని నిందితులకు నోటీసులు పంపించింది.