హార్దిక్ పాండ్య డేటింగ్ పై పుకార్లు నిజమేనా..?

SMTV Desk 2018-01-11 12:58:22  hardik pandya, dating, Elli AvrRam, krunal pandya marriage

న్యూఢిల్లీ, జనవరి 11 : టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య డేటింగ్ లో ఉన్నాడా అంటే.. అవుననే అంటున్నాయి క్రీడా, సినీ వర్గాలు. పాండ్య ఇప్పుడు స్వీడన్‌ భామ ఎల్లీ అవ్‌రామ్‌తో డేటింగ్‌ చేస్తున్నట్లు బాలీవుడ్‌ లో ప్రచారం జరుగుతుంది. ఇంతకు ముందు ఆయన బాలీవుడ్ తార పరిణీతి చోప్రా తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన తర్వాత అవి నిరాధారమైనవని తేలింది. తాజాగా ఇప్పుడు పాండ్య, బాలీవుడ్ నటి ఎల్లితో డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల పాండ్య సోదరుడు క్రునాల్ పాండ్య వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి వేడుకకు ఎల్లి హాజరైంది. అంతే కాకుండా పాండ్యతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు అంతర్జాలంలో హల్ చల్ చేస్తున్నాయి. కాగా, డేటింగ్‌ రూమర్లపై హర్ధిక్‌, ఎల్లీల్లో ఇంతవరకూ ఎవరూ స్పందించలేదు. బాలీవుడ్ లో మిక్కీ వైరస్‌ సినిమాతో అరంగేట్రం చేసిన ఎల్లి ..ఆ తర్వాత ‘కిస్‌ కిస్కో ప్యార్‌ కరూన్‌’, ‘నామ్‌ షబానా’, ‘పోస్టర్‌ బాయ్స్‌’, లోనూ తళుక్కుమంది. అంతే కాకుండా బాలీవుడ్ లో నిర్వహించే బిగ్‌బాస్‌-7 సిరీస్‌లో కంటెస్టెంట్‌ గా పాల్గొంది. ప్రస్తుతం తమిళంలో ‘పారిస్ పారిస్’, కన్నడంలో ‘బటర్ ఫ్లై’ అనే చిత్రాల్లో నటిస్తోంది.