శుభారంభం చేసిన హరియాణా హ్యామర్స్‌ ...

SMTV Desk 2018-01-11 11:24:55  PWL, LEAGUE, HARAYANA HAMMERS WON, VEER MARATHAS, NEW DELHI

న్యూఢిల్లీ, జనవరి 11: ప్రొ రెజ్లింగ్‌ మూడో సీజన్ లో హరియాణా హ్యామర్స్‌ 5-2 తేడాతో వీర్‌ మరాఠాస్‌పై గెలుపొందింది. రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత హెలెన్‌ మరోలిస్‌, హర్ఫూల్‌ తమ బౌట్లను నెగ్గడంతో వీర్‌ మరాఠాస్‌ జట్టు విజయం సాధించింది. హరియాణా రెజ్లర్లు వ్లాదిమిర్‌ (57 కిలోలు), సరిత (50 కిలోలు), హర్ఫూల్‌ (65 కిలోలు), హెలెన్‌ మరోలిస్‌ (57 కిలోలు), కెతిక్‌ తషబొలేవ్‌ (74 కిలోలు), తమ తమ బౌట్లలో సత్తా చాటారు. ఈ రోజు ఎన్ సీఆర్ పంజాబ్ రాయల్స్, యూపీ దంగల్ జట్టులు పోరులో తలపడనున్నాయి.