టీమిండియాపై అదే మా వ్యూహం : సఫారీ కోచ్ గిబ్సన్‌

SMTV Desk 2018-01-10 14:56:14  south africa coach, gibson, india, test, freedo series

కేప్ టౌన్, జనవరి 10 : భారత్- దక్షిణాఫ్రికాల మధ్య ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ లో నెగ్గిన ప్రొటీస్ జట్టు మూడు టెస్ట్ ల సిరీస్ ను 1-0 తో ముందజలో నిలిచింది. మొదటి టెస్టులో గెలుపు అవకాశాన్ని చేజేతుల కోల్పోయిన కోహ్లి సేన శనివారం సెంచూరియన్‌ వేదికగా జరిగే రెండో మ్యాచ్ లో సఫారీలను ఎలా ఎదుర్కుంటుందో అని యావత్ భారత్ క్రీడాభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆతిధ్య జట్టు కోచ్ గిబ్సన్‌ సెంచూరియన్‌లో ఏ వ్యూహంతో బరిలోకి దిగుతారో సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.." కేప్‌టౌన్‌ టెస్టు విజయం మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. కేప్‌టౌన్‌లో జరిగిన తొలి టెస్టులో నలుగురు పేసర్లతో బరిలోకి దిగి విజయం సాధించం. రెండో టెస్టులోనూ ఇదే వ్యూహం అనుసరించాబోతున్నా౦. కుదరకపోతే మరో విధంగా జట్టు కూర్పు ఉంటుంది" అని వెల్లడించారు. కేప్ టౌన్ లో జరిగిన తోలి టెస్టులో సఫారీ పేస్ ఎక్స్ ప్రెస్ స్టెయిన్‌ గాయపడడంతో ఈ సిరీస్ కు అందుబాటులో ఉండడం లేదు. దీంతో అతని స్థానంలో యువ పేసర్‌ డ్యున్‌ ఒలివరన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అంతే కాకుండా మరో సీమర్ లుంగి కూడా దక్షిణాఫ్రికా జట్టులో చోటు సంపాదించుకున్నాడు.