రైల్వే జీఎంతో తెలంగాణ ఎంపీల సమావేశం...

SMTV Desk 2018-01-10 13:41:22  railway gm, telangana mps, meet, vinod kumar yadav, rail nilayam

హైదరాబాద్, జనవరి 10: కేంద్ర బడ్జెట్ నేపధ్యంలో హైదరాబాద్ లోని రైల్ నిలయంలో రైల్వే జీఎం వినోద్ కుమార్‌తో తెలంగాణ ఎంపీలు సమావేశమయ్యారు. నేడు ఉదయం జరిగిన ఈ సమావేశానికి ఎంపీలు వినోద్ కుమార్, జితేందర్‌రెడ్డి, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కే కేశవరావు, రాపోలు ఆనంద్ భాస్కర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పనులు, పెండింగ్ పనులపై చర్చి౦చారు. పలు ప్రతిపాదనలను రైల్వే జీఎంకు తెలంగాణ ఎంపీలు విన్నవించారు.