భువనేశ్వర్ అప్.. కోహ్లీ డౌన్

SMTV Desk 2018-01-10 13:11:33  bhuvaneshwar kumar, icc test rankings, kohli, dubai

దుబాయ్, జనవరి 10 : ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ కెరీర్‌లో ఉత్తమ ర్యాంకుని చేజిక్కుంచుకున్నాడు. ఇటీవల సఫారీలతో జరిగిన తొలి టెస్టులో భువి తన స్వింగ్ మాయజాలంతో ఆరు వికెట్లు తీసి, ప్రొటీస్ జట్టు ను తక్కువ స్కోర్ కే పరిమితం చేసిన విషయం తెలిసిందే. దీంతో తన టెస్టు కెరీర్‌ ర్యాంకింగ్‌లో 8 స్థానాలు మెరుగుపరుచుకొని 22వ స్థానానికి చేరుకున్నాడు. మరో వైపు బ్యాటింగ్ విభాగంలో సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో విఫలమైన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ 13 పాయింట్లు కోల్పోయి (880) పాయింట్లతో మూడో స్థానానికి, భారత్ నయా వాల్ పుజారా (848) తో ఐదో స్థానానికి పడిపోయారు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (947 ) తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. జట్టు ర్యాంకింగ్ విషయానికి వస్తే టీమిండియా (124) తో టాప్ లో ఉండగా, దక్షిణాఫ్రికా (111) తో ద్వితీయ స్థానంలో ఉంది.