గ్రామాభివృద్ధిలో విద్యార్ధులు ముందుడాలి :సీఎం చంద్రబాబు

SMTV Desk 2018-01-10 13:05:06  ap cm chandrababu naidu, Telekanpharens meeting

అమరావతి, జనవరి 10 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి-నా ఊరు కార్యక్రమం నాంది పలికిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తొమ్మిదో రోజుకు చేరుకున్న జన్మభూమి నిర్వహణపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ లో అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతూ...ఐఎస్‌వో 9001 సర్టిఫికేషన్ సాధించిన కృష్ణా జిల్లా కలెక్టర్‌కు సీఎం అభినందనలు తెలిపారు. గత మూడున్నరేళ్లుగా రాష్ట్ర అభివృద్ధిపై, ఆర్ధిక అసమానతల తగ్గింపుపై పూర్తిగా దృష్టి పెట్టామని స్పష్టం చేశారు. ఈ మేరకు స్వల్పకాలిక, మధ్య తరహా, దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేశామని గుర్తుచేశారు. ఇప్పటివరకు 9,51,822 ఫిర్యాదులు రాగా, 6,85,104 అప్‌లోడ్ చేశారని, 2,16,272 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారని సీఎం వివరించారు. కాగా, విద్యార్ధులు నెలకోసారి గ్రామాలను సందర్శించి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.